30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ

14-04-2026 08:19 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారత్ రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సనత్‌నగర్ నెహ్రూ పార్క్‌లోని బీజేపీ చౌక్ వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకుడు రాజా మిధుల్, సమన్వయకర్త రోహిత్ మున్నా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్, నరేష్, రవి, పురుషోత్తం, కార్తిక్, ఆకాశ్ తదితర సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు.

అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు మార్గదర్శకమని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. యువత ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బాటసారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు