13 March, 2026 | 10:32 PM

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం

13-03-2026 04:53 PM

ఎంఈఓ ఉమారాణి

కొల్చారం,(విజయ క్రాంతి): కొల్చారం మండల వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మండల విద్యాధికారి ఉమారాణి తెలిపారు. మండల వ్యాప్తంగా 690 విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఉదయం 9: 35 గంటల వరకు పరీక్ష కేంద్రం లోకి అనుమతిస్తామని తెలిపారు. ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు