టీ డబ్ల్యు ఆర్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ బాలుర కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ కే. ఉమా రాణి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరము పూర్తి చేసుకున్న విద్యార్థులు అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోగరని తెలిపారు.
అడ్మిషన్ కొరకు విద్యార్థులు దోస్త్ ఐడీ ద్వారా కళాశాలలో అడ్మిషన్ పొందితే, మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉచితంగా విద్యా బోధన, వసతి, భోజనం, బట్టలు, బూట్లు, ట్రాలీ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు , నోట్ బుక్స్, జిమ్, లైబ్రరీ, కెరీర్ గైడెన్స్ , కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ , స్కిల్ డెవలప్మెంట్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. సెమిస్టర్ పరీక్షల ఫీజు సైతం గురుకులం వారే చెల్లిస్తారని, విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా విద్యనభ్యసించవచ్చని తెలిపారు.
కళాశాల అందిస్తున్న కోర్సులు
బీ కాం, (సీ ఏ)
బీ ఎస్సీ (లైఫ్ సైన్స్)
బీ ఎస్సీ (ఫిజికల్ సైన్స్), డేటా సైన్స్, బీ ఏ ( కంప్యూటర్స్)
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: 7901097694- ప్రిన్సిపల్, 9908104502- బి.కాం అడ్మిషన్ ఇంచార్జ్
9949990945- బీ జెడ్ సీ అడ్మిషన్ ఇంచార్జ్
9652307007- ఎంపీ సీ ఎస్ అడ్మిషన్ ఇంచార్జ్.






