సూపర్ కిడ్ విజేతగా జాన్ వెస్లీ
ముగిసిన కిడ్స్ ఫెస్టివల్
ప్రతిభ వెలికి తీసేందుకే ఈ ఫెస్టివల్
పాస్టర్ పరంజ్యోతి
మహబూబ్ నగర్ అర్బన్ : రెమా వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో 2026 యేడాదికి గాను నిర్వహించిన కిడ్స్ ఫెస్టివల్ వేడుకల్లో విజేతగా జాన్ వెస్లీ నిలిచాడు. మూడు రోజులు పాటు నిర్వహించిన ఈ ఫెస్టివల్ వేడుకలు చివరి రోజైనా బుదవారం ప్రతిభ కనబరిచిన చిన్నారుల్లో విజేతగా జాన్ వెస్లీ నీ పాస్టర్ పరంజ్యోతి, జోయల్ బాబులు ప్రకటించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి ప్రసంగిస్తూ, చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే తాము ప్రతి ఏటా కిడ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించి విజేతను ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ మూడు రోజులపాటు జరిగిన వేడుకల్లో చిన్నారులకు బైబిల్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారికి అర్థమైన రీతిలో స్కిట్స్ కొరియోగ్రఫీ, క్విజ్ వంటి పద్ధతిలో వివరించామన్నారు.
చిన్నారులకు వారికి అర్థమయ్యే రీతిలో వివరించినట్లయితే వారు సులువుగా అర్థం చేసుకుని రానించగలుగుతారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడు రోజులపాటు నిర్వహించిన వేడుకల్లో నాలుగు ప్రత్యేక బృందాల టీచర్లతో చిన్నారులకు అవగాహన కల్పించామన్నారు. దేవునికి ఇష్టులుగా ఉన్నప్పుడే మనం అన్ని రంగాల్లో రాణించగలుగుతావని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా చిన్నారులకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక బహుమతులు : ఈ మూడురోజులపాటు నిర్వహించిన కిడ్స్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రతి చిన్నారికి ప్రత్యేక బహుమతులు అందజేసి వారిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో చదువులో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆకట్టుకున్న మ్యూజిక్ షో :
మ్యూజిక్ డైరెక్టర్ పీటర్సన్ చిన్నారుల కోసం నిర్వహించిన మ్యూజిక్ షో అందర్నీ ఆకట్టుకుంది చిన్నారులను ఉత్తేజపరిచేలా చేయడంతో వారంతా ఉత్సాహంతో గంతులు వేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ శ్యామ్, నిర్వాహకులు రిచ్ఛి, అభిషేక్, కళ్యాణ్, ధీరజ్, జోనా, స్వరణ్ రాజ్, జాన్ లతోపాటు అధిక సంఖ్యలో చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.






