సీనియర్ సిటిజన్స్ మండల అధ్యక్షునిగా ఆకారపు ఉపేందర్ ఎన్నిక
26-02-2026 03:36 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మండల కమిటీని మండల కేంద్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో గురువారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఆకారపు ఉపేందర్(Akarapu Upender ), ప్రధాన కార్యదర్శిగా చిత్తలూరి కరుణాకర్, గౌరవ అధ్యక్షుడిగా పాలవరపు సంతోష్, ఉపాధ్యక్షులుగా గునిగంటి సోమయ్య, యనగందుల సంజీవ, సహాయ కార్యదర్శులుగా తునికి సాయిలు, నాగేశ్వరరావు, కోశాధికారిగా తల్లాడ కేదారి, కార్యవర్గ సభ్యులుగా పాలకుర్తి ఎల్లయ్య, గుద్దేటి దాసు ఎన్నికయ్యారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడుగుండ్ల విద్యాసాగర్, శంకరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి, గుంటకండ్ల ముకుందారెడ్డి, సురేందర్ రెడ్డి, లింగారావు పాల్గొన్నారు.




