కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఐరేని సందీప్ కుమార్ నియామకం
కామారెడ్డి, మే 3 (విజయ క్రాంతి): కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఐరేని సందీప్ కుమార్ ఆదివారం తెలంగాణ ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ప్రత్యేకంగా షబ్బీర్ అలీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ బాధ్యతను ఒక గౌరవంగా, మరింతగా ఒక బాధ్యతగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, నియమాలకు కట్టుబడి పని చేస్తూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, కార్యకర్తలతో కలిసి ప్రజలకు చేరువయ్యే విధంగా సేవలందిస్తానని సందీప్ కుమార్ ధృడంగా తెలిపారు.






