పదోన్నతిపై వాంకిడి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సిహెచ్ తిరుపతి
వాంకిడి,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల, వాంకిడి ప్రిన్సిపాల్‌గా సిహెచ్ తిరుపతి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సిర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన పదోన్నతిపై వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీఐఓ రాందాస్ పాల్గొని సిహెచ్ తిరుపతికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డీఐఓ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపాల్ సిహెచ్ తిరుపతి మాట్లాడుతూ...ఉపన్యాసకులు, ఉపన్యాసేతర సిబ్బంది సహకారంతో కళాశాల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర ప్రగతికి కృషి చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో కళాశాల ఉపన్యాసకులు, ఉపన్యాసేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.






