ధర్మారంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు శుభారంభం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిర్యాల్కర్ బాలాజీ, ఉప సర్పంచ్ వెలిశాల శ్రీనివాస్ పాల్గొని భూమిపూజ నిర్వహించారు.
అలాగే వార్డు సభ్యులు కీసరి కావేరి, పొన్నం లక్ష్మి, తంగళ్లపల్లి సంధ్య, నక్క పరశురాములు, గంగుల ప్రశాంత్, దువ్వల అజయ్ హాజరయ్యారు.గ్రామపంచాయతీ కార్యదర్శి మనీషా, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజాప్రతినిధులు తెలిపారు.






