1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

గ్రామ సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

01-07-2026 05:46 PM

2 వార్డ్ మెంబర్ శ్రీకాంత్ నాయుడు

తుంగతుర్తి(విజయక్రాంతి): గ్రామ వీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ ద్యేయమని రెండో వార్డ్ మెంబర్ ఎల్లబోయిన శ్రీకాంత్ నాయుడు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు ప్రక్కన, రెండవ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పక్కన మురికి కాలువ లేకపోవడంతో చిన్న వానబడితే సైతం, రోడ్డు మొత్తం నీరు నిలబడి, దుర్గంధంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొద్ది రోజులుగా కాలువ మరమ్మత్తు చేయాలని గ్రామపంచాయతీ సర్పంచ్, అధికారులకు చెబుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీనితో బుధవారం మధ్యాహ్నం గడ్డపారతో తోముతూ, పారతో మట్టిని తీసు కాలువ మురికి నీళ్లు బయటకు వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంకూరు సుదర్శన్, యాకన్న, రమేష్ కృషి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి దవాఖాన పక్క సందులో నూతనంగా కాల్వ ఏర్పాటుకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని వీధివాసులు కాంగ్రెస్ నాయకులు, కోరుతున్నారు.