ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు
01-07-2026 05:55 PM
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 1వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాసాని నాగేశ్వరరావు ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాగేశ్వరరావుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయనకు అండగా నిలిచి, పైస్థాయి నాయకులతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయ సహకారాలు అందించడంలో ఇల్లందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ముద్రగడ వంశీ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.






