1 July, 2026 | 7:07 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

జనాభా లెక్కల స్వీయ గణన నమోదు చేసుకోవాలి

04-05-2026 02:43 AM

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, మే 3(విజయక్రాంతి):జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ గణన) విధానం ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ స్వీయ గణన ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి కుటుంబం వినియోగించుకుని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేయడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు సమాచారం ఖచ్చితత్వం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.స్వీయ గణన విధానం... ముందుగా https://se.ce nsus.gov.in బ్సైట్ను ఓపెన్ చేయాలి. సెల్ఫ్ ఎన్యుమరేషన్ (HLO) లాగిన్ వద్ద తెలంగాణను ఎంపిక చేసి Captcha నమోదు చేసి వెరిఫై మరియు ప్రొసీడ్ క్లిక్ చేయాలి. వెల్కమ్ పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి. తరువాత నచ్చిన భాషను ఎంపిక చేసుకుని, జిల్లా, గ్రామం/పట్టణం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయాలి.

మొబైల్లో లొకేషన్ ఆన్ చేసి, ఇంటి స్థానం వద్ద రెడ్ మార్క్ సెట్ చేయాలి. ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రివ్యూ ద్వారా చెక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ తో ప్రారంభమయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి వస్తుంది. దానిని స్క్రీన్ షాట్ తీసుకుని లేదా నోట్ చేసుకునిభద్రపరచుకోవాలి.

మే 11 తరువాత గణనాధికారి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఎస్‌ఈ ఐడీని చూపిస్తే వారు ధృవీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతగా మన సమాచారం స్వయంగా నమోదు చేసి సమయాన్ని ఆదా చేసుకుందామని ఆయన పిలుపు నిచ్చారు.