1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

మెరుగైన వైద్యం అందించాలి

01-07-2026 05:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో బుధవారం జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్  వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజూ 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులను ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఆస్పత్రి పర్యవేక్షకులు సరోజ, అధికారులు గోపాల్ సింగ్, రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.