1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక సమీక్ష

01-07-2026 05:41 PM

*ప్రజల వద్దకే పోలీసు సేవలు...

భైంసా,(విజయక్రాంతి): ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిర్ణీత గడువులో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు బుధవారం బైంసా పట్టణంలో పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన  ఆర్జిదారుల వినతులను ఓపికగా ఆలకించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ఎస్పీ, ప్రతి వినతిపై వ్యక్తిగత పర్యవేక్షణతో చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు.

కుటుంబ సమస్యలకు షీ టీం కౌన్సిలింగ్‌తో పరిష్కారం

గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చిన కుటుంబ వివాదాలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహన కల్పించడంతో కొన్ని కుటుంబాలు తిరిగి కలిశాయి. నిర్మల్ వరకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా భైంసాలోనే కౌన్సిలింగ్ సౌకర్యం కల్పించినందుకు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక సమీక్ష

గత గ్రీవెన్స్ డేల్లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని ఎస్పీ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని, బాధితులకు పారదర్శకంగా న్యాయం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు సత్వర, పారదర్శక, నాణ్యమైన పోలీసు సేవలు అందించడం నిర్మల్ పోలీసుల ప్రధాన లక్ష్మన్నారు.