23 March, 2026 | 2:44 PM

ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం.. ధ్వంసమైన ముందు భాగం

23-03-2026 11:38 AM

ఆల్బనీ: న్యూయార్క్ లో ఎయిర్ కెనడా విమానానికి(Air Canada Express Plane) ప్రమాదం జరిగింది. న్యూయార్క్ లోని లాగార్డియా ఎయిర్ పోర్టులో( LaGuardia Airport) ఈ ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం వాహనాన్ని ఢీకొట్టింది. విమాన ప్రమాదంతో లాగార్డియా ఎయిర్ పోర్టుకు రాకపోకలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలను జేఎఫ్ కే విమానాశ్రయానికి మళ్లించారు.

ప్రమాదంలో విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:40 గంటలకు కొద్దిసేపటి ముందు జరిగిన ఈ ఘటనలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అగ్నిమాపక సిబ్బంది పోర్ట్ అథారిటీ పోలీస్ విభాగానికి చెందినవారని సమాచారం. సీఆర్జే-900 విమానంలో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారని అధికారులు వెల్లడించారు.