మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐలి ప్రసాద్‌కు మరోసారి అవకాశం
పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం
మంథని, ఆగస్టు 13విజయ క్రాంతి మం థని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఐ లి ప్రసాద్ రెండోసారి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఆ యనకు మరోసారి పార్టీ మండల అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఐలి ప్రసాద్ పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చే శారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం ఐలి ప్రసాద్ చేసిన కృషి, ప్ర స్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతానికి చేస్తున్న సేవలను అధిష్టానం గుర్తించి మరోసారి మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఐలి ప్రసాద్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తె లిపారు. తనపై మరోసారి నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదా లు చెప్పారు.
పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంథని మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.ఐలి ప్రసాద్కు రెండోసారి మండల అధ్యక్ష బాధ్యతలు దక్కడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.






