కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి
జేఎన్‌టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.సురేష్ బాబు
ఘట్కేసర్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : విద్యార్థులు క్రమశిక్షణ, సృజనాత్మకత, సాం కేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించుకోవాలని జేఎన్టీయూహెచ్ యూసీఈఎస్టీ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సురేష్ బాబు అన్నారు. ఘట్ కేసర్ డివిజన్ పరిధి, కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల లో నూతనంగా చేరిన బీటెక్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ 21వ ఓరియంటేషన్ డే గురువారం నిర్వహించారు.
ఈకార్యక్రమాన్ని ముఖ్య అతిథి జేఎన్టీయూహెచ్ యూసీఈఎస్టీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇం జినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సురేష్ బాబు ప్రారంభించారు. గౌరవ అతిథిగా సైకాలజిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ వారి అభిషేక్ సింగంశెట్టి పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జానకి రాములు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శివకేశవ రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ స్వాతి రెడ్డి, బోర్డు సభ్యుడు హవీష్ రెడ్డి, సెక్రటరీ రాజేంద్ర కృష్ణ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ నాగ మల్లేశ్ పాల్గొన్నారు.






