2 June, 2026 | 4:33 AM

సూర్యక్షేత్రాన్ని సందర్శించిన ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తంరెడ్డి

02-06-2026 01:07 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 1: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనా రాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాధిక్షేత్రాన్ని సోమవారం ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.అనంతరం ఆలయ విశిష్టతను తెలుసుకొని స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు.అలాగే ఆలయ ప్రాంగణంలోని కార్యసిద్ధి వీర హనుమాన్, శ్రీరా మకోటి స్తూపాలను కూడా దర్శించుకున్నా రు. అనంతరం నిర్వాహకులు శాలువాలతో సన్మానించి,స్వామివారి చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్,గణపురం నరేష్,అర్చకులు పాల్గొన్నారు.