06-02-2026 02:51:02 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని రైతులు సబ్సిడీ వ్యవసాయ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలని ఏఓ నాగరాజు తెలిపారు.సబ్సిడీపై హఫ్ కేజీ వీల్,9 టైన్ కల్టివేటర్,12 డిస్క్ హరో, 2ఎంబి ప్లౌ, 11 టైన్ కల్టివేటర్, పవర్ టిల్లర్, రోటవేటర్, తైవాన్ స్ప్రేయర్, పవర్ వీడర్ మొదలగు పరికరాలు లభిస్తాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు 50%, జనరల్ వారికి 40% సబ్సిడీ ఉంటుందని తెలిపారు. కావలసిన రైతులు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇట్టి అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.