7 July, 2026 | 3:39 PM

Breaking News

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •  

పెద్దమల్లారెడ్డి గ్రామ చెరువును పరిశీలించిన ఏఈ ఆనంద్

12-02-2026 02:43 AM

భిక్కనూర్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని చెరువు నీటిని, తూమును  ఏఈ ఆనంద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ఆయనతో పాటు ఉన్నారు.

చెరువులో నీటి నిల్వ స్థాయి, తూము పరిస్థితిని ఏఈ అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అవసరాల కోసం చెరువునుంచి విడుదల చేసిన నీరు రైతుల పొలాలకు సక్రమంగా చేరుతోందా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా తూము, కాలువల సంరక్షణ చేపట్టాలని సూచించారు.