జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం
ముత్తరం, జూన్ 01 (విజయక్రాంతి): ముత్తరం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ జాగరి సమ్మయ్య తల్లి జాగరి గట్టమ్మ ఇటీవల మృతి చెందారు. సోమవారం ఆమె పార్థివ దేహానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం శేఖర్, నాయకులు మాట్ల రవీందర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతురాలికి నివాళులు అర్పించారు.






