30 June, 2026 | 8:36 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్ ప్రభంజనం

24-02-2026 01:20 AM
  1. 35 పతకాలతో ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం
  2. విజేతలను అభినందించిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈనెల 17న నిర్వహించిన తొలి రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాల గల పిల్లల క్రీడా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వివిధ విభాగాల్లో సమిష్టి ప్రతిభతో మొత్తం 35 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకు ని సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో కలెక్టర్ రాజర్షి షా విజేత విద్యార్థులను, వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేసి, క్రీడల్లో మరింత రాణించాలని ప్రోత్సహించారు. విద్యార్థులను తీర్చిదిద్ద డంలో కీలక పాత్ర పోషించిన వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, క్రీడల్లో వారు సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.

సరైన ప్రోత్సాహం, మార్గదర్శక త్వం ఉంటే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా రాణించగలరని పేర్కొన్నారు. జిల్లా నుంచి మొత్తం 26 మంది విద్యార్థులు ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారులు తిరుపతి, రఘు రమణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయా మ ఉపాధ్యాయులు, కోచ్‌లు విద్యార్థులు పాల్గొన్నారు.