ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దాలి
- ఎంపీ గోడం నగేష్
- ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలి
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పిలుపు
ఆదిలాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దాలనీ ఎంపీ గోడం నగేష్ వైద్య శాఖ అధికారులకు సూచించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపం చ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ము న్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా టిబి నియంత్రణపై ప్రతిజ్ఞ చేసి, ఆయుష్ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదేవిదంగా ఉత్తమ వైద్య సేవలు అందించిన పలువురు వైద్యులకు, సిబ్బందికి, నిక్షయ మిత్రాలకు అతిథులు ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం నూతన టిబి ఎక్స్ రే యంత్రాన్ని కలెక్టర్, ఎంపీ ఆవిష్కరించి, టిబి వ్యాధిగ్రస్థులకు నిక్షయా పోషన్ కిట్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ... మానవ జీవితం చాలా స్వల్పమైనదని, డబ్ల్యూహెచ్‌ఓ నివేదికల ప్రకారం సగటు జీవిత కాలం 60 నుండి 70 ఏళ్లకు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరో గ్య సంస్థ ఒక ప్రత్యేక థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇది కేవలం సంబరాల కోసం కాకుండా మన ఆరోగ్యంపై మనకు అవగాహన కలిగించే ‘అలా రం’ వంటిదని పేర్కొన్నారు.
నేటి సమాజంలో 30-40 ఏళ్లకే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగితే ప్రభుత్వం వైద్యం కోసం చేసే భారీ ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాత్ర కీలకమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్యులను ఎంతగానో నమ్ముతారని, వారికి సరైన అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ... ఆరోగ్య వారో త్సవాల్లో భాగంగా సేఫ్ మదర్ హుడ్, ఎయి డ్స్ నివారణ, ఆయుష్ వంటి అంశాలపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రిమ్స్ ఆసు పత్రి జిల్లాకే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని కొనియాడారు. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ విభాగంలో జరుగుతున్న శస్త్రచికిత్సలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు చేపట్టిన ’సంకల్ప’ ప్రోగ్రామ్ ద్వారా రిమ్స్ కు జాతీయ స్థాయి గుర్తింపు, టీబీ నివారణలో జిల్లా యంత్రాంగం సాధించిన పురోగతికి గాను అవార్డులు రావడం అభినందనీయమన్నారు.
పాఠశాల స్థాయి నుండే పిల్లలు గుట్కా, పాన్ మసాలా, మద్యం, గంజాయి వంటి అలవాట్లకు లోనవుతుండటం ఆందోళనకరమని, ఇటువంటి వారిని గుర్తించి రిమ్స్ లేదా స్వచ్ఛంద సంస్థలు నడిపే డి-అడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని ఆశా కార్యక ర్తలకు సూచించారు. అలాగే గర్భిణీ స్త్రీలలో రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉందని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను సక్రమంగా వాడేలా చూడాలన్నారు.
ఆర్‌ఎం పీల వద్దకు వెళ్లి అనవసరమైన యాంటీబయాటిక్స్, ఇంజక్షన్లు తీసుకోవడం వల్ల కిడ్నీ లు దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా రోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, లీగల్ అడ్వైజర్ దాసరి గంగారం, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




