9 August, 2026 | 12:39 AM

ఫ్లైఓవర్ రోడ్ల పనులను పరిశీలన అదనపు కలెక్టర్

08-08-2026 03:20 PM

బాలానగర్:  మండలం కేంద్రం లో జరుగుతున్న ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు, సకాలంలో పూర్తి చేయాలి అని ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండ ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకోవాలనికలెక్టర్ మధుసూదన్ నాయక్  శనివారం అన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్   పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల నుంచి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు ఎలాంటి రాజీ లేకుండా పనులు జరగాలని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు  ఆదేశాలు జారీ చేశారు. పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ప్రభుత్వం ఆమోదించిన ప్రమాణాలను పాటించాలని, భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. అధికారులు, సంబందించిన కాంట్రాక్టు అధికారులు, పాల్గొన్నారు.