9 August, 2026 | 4:07 AM

వినియోగదారులకు ఎండీఆర్ ఛార్జీలుండవు

09-08-2026 12:36 AM

కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ 

న్యూఢిల్లీ, ఆగస్టు 8: యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పీ2పీ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితమని ఆర్థిక మం త్రి త్వ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చెల్లింపులు, పీఎ స్‌ఎస్ చట్ట సవరణ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, మార్పులను కొందరు తప్పుగా అన్వయించుకున్నారని తెలిపింది. ఎండీఆర్ వచ్చినా వ్యాపారులందరికీ వర్తించదని తెలిపింది.

పరిమిత మర్చంట్స్ లావాదేవీలపైనే నామమాత్రపు ఎండీఆర్ వర్తిస్తుందని పేర్కొంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ఎండీఆర్ కంటే యూ పీఐ ఎండీఆర్ చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. యూపీఐ దీర్ఘకాలిక స్థిరత్వం కోసమే పీఎస్‌ఎస్ యాక్ట్‌ను సవరించాలని తెలిపింది. సైబర్ సె క్యూరిటీ, ఫ్రాడ్ నివారణకు భారీ పె ట్టుబడులు అవసరమని తెలిపి ంది.

యూపీఐని మరింత విస్తరించేందుకు స్వయం-స్థిర మైన ఆదాయ నమూనా అవసరమని పే ర్కొంది. జూలైలో రూ.2,366 కోట్ల యూ పీఐ లావాదేవీలు జరిగాయని, యూపీఐ భారత్ సొంత ఆవిష్కరణ కేంద్రమని స్పష్టం చేసింది. 11 విదేశాల్లో యూపీఐ అందుబాటులో ఉందని కేంద్రం పేర్కొంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఎకు మార్పులను ప్రతిపాదించే టాక్సేషన్ అండ్ అదర్‌లాస్ (సవర ణ) బిల్లు, 2026ను పార్లమెంట్ ఆమోదించింది.