9 August, 2026 | 1:48 AM

ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

08-08-2026 03:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలం వంజర్ గ్రామానికి  చెందిన ముక్కెర భోజన్న కి అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం రూ 2.00 లక్షల LOC చెక్కును సదరు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న తమ కుటుంబానికి  అండగా ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.