డిగ్రీ, నైపుణ్యాలతోనే ఉద్యోగం
- బీఎఫ్‌ఎస్‌ఐలో 20 వేల ఉద్యోగ అవకాశాలు
- శిక్షణతోపాటు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
- పరిశ్రమలు కూడా విద్యావ్యవస్థలో భాగం కావాలి
- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీ ఒక్కటే సరిపోదని, నైపుణ్యాలు కూడా తోడైతేనే ఉద్యోగ అవకా శాలు తలుపు తడుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు అన్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 20 వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నా యని తెలిపారు. నిరుద్యోగులకు పరిశ్రమకు కావాల్సిన నైపు ణ్యాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్, మారుతున్న పరి స్థితులకు అనుగుణంగా మారే శక్తి, నిరంతరం నేర్చుకునే తత్వం అవసరమని చెప్పారు.
పరిశ్రమ లు కూడా విద్యావ్యవస్థలో భాగస్వాములు కావాలని సూచించారు. మార్కుల మెమోలతో డిగ్రీల ను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞా నం, ఆత్మవిశ్వాసంతో కూడిన యువతను తయా రు చేసే గమ్యం వైపు తెలంగాణ అడుగులు వే స్తోందన్నారు. విద్య, పరిశ్రమ, ఉపాధిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి యువతను భవిష్యత్ ఉద్యో గాలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ పరిశ్రమ, విద్యాసంస్థలు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావ డం అభినందనీయమన్నారు. రాయదుర్గంలోని టీవర్క్స్ ప్రాంగణంలో శనివారం జరిగిన ఫ్యూ చర్ స్కిల్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల నుంచి ఏటా 2 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని తెలిపారు.
వారికి ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీ ఒక్కటే సరిపోదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని యువ జనా భాను అతిపెద్ద వనరుగా గుర్తించిం దన్నారు. వీరంతా నైపుణ్యాలతో కూడిన మానవ వనరుగా మారినప్పుడే అది నిజమైన డెమోగ్రాఫిక్ డివిడెండ్‌గా మారుతుందన్నా రు. ‘మా లక్ష్యం కేవలం విద్య అందించడం కాదు.. ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన విద్యను అందించడం’ అని అన్నారు.
పాత కాలం నాటి ఐటీఐ కోర్సులను ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నామని చెప్పారు. మన ఐటీఐలు రేపటి ఫ్యాక్టరీల కోసం యువతను సిద్ధం చేయాలన్నారు. టాటా సన్స్ స హకారంతో రూ.2,400 కోట్లతో ఈ కేంద్రాలను భవిష్యత్తు పరిశ్రమ అవసరాలకు తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు.
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 20 వేల ఉద్యోగాలు
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశం లో నైపుణ్యాభివృద్ధికి కొత్త నమూనాగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో యూనివర్సిటీ పనిచేస్తోందని తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు, ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమల్లో అనుభవం కల్పించడమే లక్ష్యమన్నారు.
ప్రతి విద్యార్థి ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ మార్కెటింగ్, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పొందాలని సూచించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మారుతాయని, అలాగే కొత్త వృత్తులు, కొత్త పరిశ్రమలు, కొత్త అవకాశాలు భారీగా వస్తాయని చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో సుమారు 20 వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. నైపుణ్యాల అంతరాన్ని ప్రభుత్వం ఒక్కటే పూడ్చలేదని, పరిశ్రమలు విద్యా వ్యవస్థలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ నిర్వాహకులు రమణ, క్రిష్, టీవర్క్స్ సీఈవో జోగిందర్ తణికెళ్ల, టాస్క్ సీఈవో నితిన్‌రెడ్డి పాల్గొన్నారు.






