ఎస్ఐఆర్ సర్వే పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
11-07-2026 05:31 PM
ఖానాపూర్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో చేపట్టిన ఎస్ఐఆర్ సర్వే నిర్మల్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం పరిశీలించారు. అక్కడి బిఎల్ఓలతో మాట్లాడుతూ దరఖాస్తు ఫారాలలో ఎటువంటి తప్పులు లేకుండా నింపేందుకు ఓటర్లకు వివరించాలని అందుకు కావలసిన సహాయం చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం, తాసిల్దార్ సుజాత రెడ్డి, కమిషనర్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.






