11 July, 2026 | 6:48 PM

సర్ ప్రక్రియ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

11-07-2026 05:37 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓ లు అంతా తప్పనిసరిగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎస్ఐఆర్ ఫారములను తిరిగి తీసుకుని, గడువులోగా ఆన్ లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగించాలన్నారు. ఫారము పూరించుటలో బిఎల్ఓ లు సహకారం అందించాలని తెలిపారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.