28 July, 2026 | 12:57 AM

రాజన్న ఆలయానికి నిధుల మంజూరుపై హర్షం

28-07-2026 12:08 AM

- భీమన్నకు కాంగ్రెస్ శ్రేణుల పూజలు

వేములవాడ, జులై 28, (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.99.40 కోట్ల నిధులు మంజూరు చేసిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూము మధు ఆధ్వర్యంలో కోడె మొక్కు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, తాజాగా మంజూరైన నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరాల శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగారం వెంకటస్వామి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.