29 April, 2026 | 3:02 PM

Breaking News

ఓ సామాన్యుడిలా ఓటేసిన మిథున్ చక్రవర్తి

29-04-2026 12:46 PM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనల నడుమ మొత్తం 3.21 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 40 శాతం మంది ఉదయం 11 గంటల సమయానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ 11 గంటల వరకు 39.97 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే సమయంలో, భబానీపూర్ నియోజకవర్గంలోని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో TMC భబానీపూర్ అభ్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సువేందు అధికారి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి విజ్ఞప్తి చేశారు.

బెంగాల్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి బుధవారం తూర్పు కోల్‌కతాలోని బెల్గాచియాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో కనిపించినట్లుగానే, ఈ దశలోనూ భారీగా పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "ఎలాంటి ప్రత్యేక సదుపాయాలనూ ఆశించకుండా, క్యూలో నిలబడి ఒక సాధారణ ఓటరులాగే తాను ఓటు వేశానని" చక్రవర్తి విలేకరులతో చెప్పారు. "నాకు ఎలాంటి సదుపాయాలూ వద్దు. నేను ఒక సాధారణ వ్యక్తిలాగే ఓటు వేశాను," అని మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు.

ఓటింగ్ శాతం గురించి ప్రస్తావిస్తూ, బీజేపీ నాయకుడు ఇలా అన్నారు. బెంగాల్ తుది దశలో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కానున్నట్లు అంచనా వేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో భాగంగా చివరి దశ పోలింగ్ 142 స్థానాలకు జరుగుతుండగా, రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మహువా మొయిత్రా నుండి, పానిహటి నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న, RG Kar ఘటన బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ వరకు బెంగాల్ నాయకుల సిరా గుర్తులతో ఫోటోలకు ఫోజులిచ్చారు.