29 July, 2026 | 2:12 AM

నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరిపై చర్యలు

29-07-2026 12:11 AM

కోర్టు ఆదేశాలతో ఒక్కోరికి రూ.50 జరిమానా, ఒక రోజు సాధారణ జైలు శిక్ష

నాగోల్, జూలై 28 (విజయ క్రాంతి): చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధన లను ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజ రుపరచగా, న్యాయస్థానం జరిమానాతో పా టు ఒక రోజు సాధారణ జైలు శిక్ష విధించింది. చైతన్యపురిలోని ఇందిరా నగర్కు చెం దిన సీహెచ్. రమేష్ (36) అనుమతించిన సమయాలను మించి ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుగా టిఫిన్ సెంటర్ నిర్వహించినందు కు ఆయనపై 70(బీ) సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అనంతరం విఐ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, 50 జరిమానాతో పాటు ఒక రో జు సాధారణ జైలు శిక్ష విధించింది. అదే ప్రా ంతానికి చెందిన విశాల్ (36) చైతన్యపురి మె యిన్ రోడ్డుపై అనుమతి లేకుండా తోపుడు బండి ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహించినందుకు 39(బి) సీపీ చట్టం కింద కేసు న మోదు చేశారు. ఈ కేసులో కూడా న్యాయస్థానం 50 జరిమానాతో పాటు ఒక రోజు సాధారణ జైలు శిక్ష విధించింది.

ఈ సందర్భంగా చైతన్యపురి పోలీసులు ప్రజలకు విజ్ఞ ప్తి చేస్తూ, వ్యాపార సంస్థలు, టిఫిన్ సెంట ర్లు, హోటళ్లు తదితర వాణిజ్య సంస్థలు అనుమతించిన సమయాల్లోనే నిర్వహించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ కోరారు.