నిరంతర సాధనతోనే లక్ష్య సాధన సాధ్యం
తుంగతుర్తి సీఐ నరసింహారావు
నూతనకల్, మార్చి 6: విద్యార్థులు చదువులో చురుకుగా ఉంటూ నిరంతర సాధన చేస్తేనే తమ లక్ష్యాలను సాధించగలుగుతారని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అధిరోహించవచ్చని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు అన్నారు. ’పోలీసు ప్రజా భరోసా’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, శుక్రవారం మండల కేంద్రంలోని విజయ మేరీ హై స్కూల్ను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా స్థానిక ఎస్త్స్ర నాగరాజుతో కలిసి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.
ముఖ్యంగా పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని నిరంతరం ప్రాక్టీస్ చేస్తేనే మంచి ఫలితాలు సాధించగలరని,ప్రాథమిక స్థాయిలోనే కష్టపడటం అలవాటు చేసుకుంటే, పై తరగతులకు డి వెళ్ళినప్పుడు చదువు సులభతరం అవుతుందన్నారు.పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




