7 March, 2026 | 10:47 AM

‘ప్రజా పాలన ప్రణాళిక’ ప్రారంభం

07-03-2026 01:17 AM

ఆలేరు, మార్చి 6:  ఆలేరు మున్సిపాలిటీలో  ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి,   మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పాలకవర్గ సభ్యులు కలిసి శుక్రవారం ఉదయం 7 వ వార్డు శివాలయం వీధిలో ప్రారంభించారు. 99 రోజుల పాటు మున్సిపాలిటీలో ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించి మౌలిక మార్పులు, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తామని. వార్డు సభ్యులు ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి మాట్లాడుతూ మున్సిపాలిటీ శుభ్రత, పన్నుల వసూళ్ల డ్రైవ్, తాగునీటి వనరుల పరిశీలన, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాల మరమ్మతులు, చెత్త నిర్వహణ చర్యలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గరవుతామని వారి అవసరాలకు అనుగుణంగా వారి సమస్యలను తెలుసుకొని, తీరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ జగన్మోహన్, అంగడి వైస్ చైర్మన్ ఆంజనేయులు, పస్తం ఆంజనేయులు, బీజన కళ్యాణి, బొట్ల సంపత్ మరియు పాలకవర్గ సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జాజిరెడ్డిగూడెం..

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం మండల కేంద్రం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఝాన్సీ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం,గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం,పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని అన్నారు.అనంతరం కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసి పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయుటకు ప్రణాళికలు రూపొందించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.