30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు

22-04-2026 09:07 PM

* నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

 * జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌కు పూల మొక్కను అందించి, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, అర్హత గల ప్రతి విలేకరికి కార్డు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ), కమిటీ సభ్యులపై ఉందన్నారు.

అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మార్గదర్శకాలను కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కార్డులు జారీ చేయకూడదని ఆయన ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని, త్వరలోనే జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.