20 August, 2026 | 4:23 PM

ఉచిత పథకాల వల్ల ప్రమాద ఘంటికలు

20-08-2026 03:29 PM

హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది. ఉచిత పథకాల వల్ల ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని హైకోర్టు సూచించింది. పదవీవిరమణ అనంతరం ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా అందటం లేదని హైకోర్టు తెలిపింది. ఫించన్లు, బెనిఫిట్స్ అందక చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో సరైన వివరాలు లేవని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. విచారణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.