20 August, 2026 | 4:23 PM

భావి భారత నిర్మాణానికి రాజీవ్ దర్శనికుడు

20-08-2026 03:42 PM

బోథ్. ఆగస్టు 20: భావి భారత నిర్మాణానికి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని ఆయన చేసిన సేవలవల్లనే నేడు దేశం అభివృద్ధి పతంలో ముందుకు వెళ్తుందని దన్నూరు గ్రామ సర్పంచ్ హేల్మ రోహిణి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆవరణలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. యువతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అన్నారు. భవిష్యత్తును యువత చేతుల్లో పెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.