20 August, 2026 | 5:25 PM

ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

20-08-2026 04:14 PM

బోథ్. ఆగస్టు 20: ఇండ్లు లేని నిరుపేదలందరికీ తమ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని మాజీ ఎంపీ రాజ్ గోండుసేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపు రావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. గత ప్రభుత్వం పేదలకు ఇండ్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించింది అన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని గ్రామంలోని పేదలకు 20 ఇందిరమ్మ ఇండ్లను మంజూరి ఇస్తామన్నారు. లక్ష రూపాయల రుణమాఫీతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్న, అధికారప్రతినిధి పశుల చంటి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, పన్నాల సెమిందర్ రెడ్డి, సర్పంచులు నారాయణ, పెందుర్ పృద్వి, మహమ్మద్, అబూద్, మల్యాల అంజయ్య, మహేందర్, ఆత్రం సుశీల, నీరజ తదితరులు పాల్గొన్నారు.