అశ్వాపురంలో ఘనంగా రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
20-08-2026 03:21 PM
అశ్వాపురం, ఆగస్టు 20: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను అశ్వాపురం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్‌బాబు అధ్యక్షతన ఓరుగంటి వీరయ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ ఆలోచనలు, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి బిక్ష్మయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, వేములపల్లి రమేష్, గాదె ప్రతాపరెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






