27 June, 2026 | 4:54 AM

సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన గుత్తా

27-06-2026 02:25 AM

నల్లగొండ టౌన్, జూన్ 26: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 67 మంది నిరుపేదలకు సీఎం సహాయనిది చెక్కులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నల్గొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. 67 మంది లబ్ధిదారులకు 24 లక్షల 69 వేల చెక్కులను అందించారు. అనారోగ్యానికి గురైన పేదలపై ఆర్థిక భారం పడకుండా సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా కలిగిస్తుందన్నారు.