భూ సేకరణను వేగిరం చేయండి
కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ జూలై 10 (విజయ క్రాంతి) : భూ సేకరణను వెగీరం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్‌ఏఐ), రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖు ష్బూ గుప్తా భూసేకరణ పురోగతిని పరిశీలించారు.
అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా చేసి ముందుకు సాగాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవ డం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. ఎల్.బి హ రిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, అర. డి.ఓ నవీన్, భూ సర్వే రికార్డుల శాఖ అశోక్, ఎన్ హెచ్‌ఏఐ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






