9 June, 2026 | 5:07 PM

ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

09-06-2026 03:44 PM

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రోడ్లు, భవనాల శాఖ (R&B) చీఫ్ ఇంజనీర్ జె. మోహన్ నాయక్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మదాపూర్ లోని మోహన్ నాయక్‌ నివాసంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అతని ఆస్తులు, మాదాపూర్‌లోని నివాసం, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఏసీబీ (ACB) 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మోహన్ నాయక్ ఆదాయానికి మించి అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపించబడుతున్న అదనపు ఆస్తుల పూర్తి వివరాలను తెలుసుకోవడానికి సోదాలు సాయంత్రం వరకు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 20కు పైగా విదేశీ మద్యం సీసాలను గుర్తించిన ఏసీబీ అధికారులు. మోహన్ నాయక్ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తుంది.

ఈ సందర్భంగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సీహెచ్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మోహన్ నాయక్ ఇంట్లో రూ.60 లక్షల నగదు గుర్తించామని, మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ లో స్థలాలు పత్రాలు, కిలో బంగారు నగదు, 13 బంగారు బిస్కెట్లు గుర్తించినట్లు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎర్రమంజిల్ లోని కార్యాలయంలో ఫైళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.