8 August, 2026 | 4:46 AM

ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ‘ఆరోగ్యశ్రీ’

08-08-2026 01:22 AM

ఎల్బీనగర్ ఇన్ చార్జి సుధాకర్ మాదిగ

ఎల్బీనగర్, ఆగస్టు 7: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి బత్తిని సుధాకర్ మాదిగ అన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం అమలు, రోజు సందర్భంగా శుక్రవారం ఎల్బీనగర్ మహనీయుల విగ్రహాల దగ్గర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం లో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాది గ మాట్లాడుతూ... పేదలు, దివ్యాంగులకు ఉచితంగా వైద్యం చేయించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనేక పోరాటాలు చేశారన్నారు.

ఆనాటి పోరాటాల ఫలితంగానే నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ప్రైవేటు దవాఖానల్లో ఉచిత వైద్య సేవలు పొందడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని సరిగ్గా 2007 ఆగస్టు 7వ తేదీన అమలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యసేవలు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా మహానీయులను స్మరించుకుంటూ అంబేద్కర్, బీజే ఆర్ విగ్రహాలకు ఎమ్మార్పీఎస్ నాయకు లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం.రాజు మాదిగ, గిరి మాదిగ, యాదయ్య మాదిగ, చంటి మాదిగ,  క్రాంతి కుమార్ మాదిగ, హుస్సేన్ మా దిగ, రంగన్న మాదిగ,  బీసీ నాయకులు భీమ్ రావు, గోపిశివ, రాము, చరణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.