8 August, 2026 | 3:41 AM

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

08-08-2026 01:24 AM

సీఐ జలంధర్ రెడ్డి

మేడిపల్లి, ఆగస్టు 7 (విజయక్రాంతి): సమాజ భాగస్వామ్య పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా నేడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. జలేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సహచరి గ్రూపు సభ్యులతో మేడిపల్లిలోని పాత పీఎంసీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో మహిళల భద్రత, రోడ్డు భద్రత, నేరాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యత, అత్యవసర పరిస్థితుల్లో అనుమాన్సపద్ధ వ్యక్తుల కధలీకల గురించి పోలీసులకు వెంటనే సమాచారం అందించడం వంటి అంశాలపై సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. తమ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు చురుకుగా పనిచేయాలని, ప్రతి సభ్యుడు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్ గా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.