ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు
28-02-2026 03:49 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఢిల్లీ లిక్కర్ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీ వాల్ కు కోర్టు క్లీన్ సీట్ ఇవ్వడంతో శనివారం జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నిస్వార్థ నిజాయితీ పాలన చేసిన ఆమ్ ఆద్మీ పార్టీపై ఉద్దేశపూర్వకంగానే లిక్కర్ కుంభకోణం కేసులు పెట్టిన ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ సయ్యద్ సాదిక్ వహిది లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




