హుస్నాబాద్‌కు అభివృద్ధి త్రివేణి
ఆయిల్ పాంతో రైతుకు భరోసా
ఏటీసీతో యువతకు నైపుణ్యం
ఇంజనీరింగ్ కళాశాలతో విద్యకు కొత్త వెలుగు
మంత్రులు వివేక్, పొన్నం
హుస్నాబాద్, జూలై 10: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాలకు ఊతమి చ్చే మూడు ప్రధాన కార్యక్రమాలకు మ ంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి శ్రీకారం చుట్టారు. అక్కన్నపేట మండ లం జనగామలో ఆయిల్పామ్ మొక్కలు నా టిన మంత్రులు, తోటపల్లిలో రూ.45.15 కోట్లతో నిర్మించనున్న అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)కు భూమిపూజ చేశారు.
ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్నాబాద్ లో టామ్కామ్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన విదేశీ ఉద్యోగ మేళాలో పాల్గొన్నారు. జనగామలో జరిగిన మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో 8 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతు సంపత్ను మంత్రులు అభినందించి సత్కరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం 14 వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతోందన్నారు.
ఎకరాకు రూ.50 వేల వరకు సబ్సిడీ, నాలుగేళ్ల పాటు అంతర పంటల సాగుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి రైతులు ఆయిల్పామ్ సాగు వైపు రావాలని సూచించారు. తోటపల్లిలో నిర్మించే ఏటీసీ ద్వారా రోబోటిక్స్, 3డి ప్రింటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమే షన్, ఎలక్ట్రిక్ వాహనాలు తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో యువతకు శిక్షణ అందనుంది. టాటా టెక్నాలజీస్ రూ.31.05 కో ట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.01 కోట్లు కేటాయించనున్నాయి. ఒక్కో ఏటీసీలో 288 మంది శిక్షణ పొందనుండగా స్టైపెండ్ అందించనున్నారు.
టామ్కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాకు 1500 మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రులు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాలు ఏ డాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హాస్టల్ నిర్మాణానికి రూ.15 కోట్లతో అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. మొదటి సం వత్సరంలో 250 మంది విద్యార్థులు చేరారని, నాలుగేళ్లలో వెయ్యి మంది విద్యార్థుల కు విద్య అందే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకట్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాం చక్రవర్తి, సీపీ రష్మీ పెరుమాళ్, లక్ష్మీకిరణ్, తదితరులు పాల్గొనారు.






