11 April, 2026 | 4:00 AM

ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం

11-04-2026 01:51 AM

పబ్లిక్ హియరింగ్ బైట్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

జవహర్‌నగర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశా ల ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గబ్బిలాల పేటలో, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరై మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలైన గబ్బిలాల పేట, రాజీవ్ గాంధీ నగర్, శాంతినగర్, గిరి ప్రసాద్ నగర్, నందమూరి నగర్, ఈ ఐదు బస్తీలు కలుపుకొని గబ్బిలాల పేటలో ప్రభుత్వ హైస్కూల్ నిర్మించడం అత్యవసరమని, దాని సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.

పాఠశాల నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు వెంకటరెడ్డి, విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సుజాత సీపీఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, విఎన్ బోస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.