543 సీట్లలోనే మహిళలకు 181 ఇవ్వొచ్చు?!
- 50 శాతం ఎంపీ సీట్ల పెంపుతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం
- సీట్ల సంఖ్య పెరిగితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు చెప్పరాసి పదవీ రాదు
- బీఆర్‌ఎస్‌లో అనేక మందికి ఏమి జరిగిందో అందరికీ తెలుసు
- సీడబ్ల్యూసీ తర్వాత మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ఇప్పుడున్న 543 సీట్లలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేసి 181 సీట్లు ఇవ్వొచ్చు కదా..? అని ముఖ్యమంత్రి రేంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అత్యవసరం ఎందుకని సీఎం ప్రశ్నించారు. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, చిన్న రాష్ట్రాలు చిన్నగా.. పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా అయిపోతాయన్నారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో నియోజక వర్గాల పెంపుపై కీలకమైన అభిప్రాయాలను తెలియజేసినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. 50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాలకు జరిగే నష్టాలపై సమావేశంలో స్పష్టంగా చెప్పినట్లు సీఎం వివరించారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల పెం పుతో చిన్నరాష్ట్రాలు ప్రాముఖ్యత కోల్పోతా యి. ఉత్తరాదికి అడ్వాంటేజ్‌గా మారనుంది.
ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నియోజక వర్గాలపెంపు పార్టీల సమస్యకాదు.. ప్రాంతా ల సమస్య. నియోజకవర్గాలను పెంచితే చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ మాత్రమే ఉండాలి. కానీ, నియోజకవర్గాల పెంపు అందమైన ముసుగులో మోసం చేస్తున్నారు. ఆర్థిక ప్రాతిపదిక న నియోజకవర్గాలు పెంచవచ్చు’ అని సీఎం పేర్కొన్నారు. మెరిట్ డిసబిలిటీ విధానంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండాలన్నారు.
‘బీజేపీ పెడుతున్న మెలికల్లో రాజకీ య స్వార్థం ఉంది. ఈ వివక్షను మేము అంగీకరించబోం’అని రేవంత్‌రెడ్డి అన్నారు. సీట్లు ఎలా పెంచాలి? ఏంటి అనేది చర్చ లేకుండా ఇప్పటికిప్పుడు ఎందుకింత అర్జెంటని విమర్శించారు. తెలంగాణలో ఐదు నెలల్లో జనగణన, కులగణనను పూర్తి చేసామన్నారు. నియోజకవర్గాల పెంపుపై సౌత్ లో రియాక్షన్ వచ్చి.. చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే అప్పుడు ఏమిచేస్తారు? బిల్లు అడ్డుకో వాల్సి వస్తే పోరాటం తప్పదన్నారు.
సదరన్ రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉన్నాయని, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిట ల్‌గా కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఒక్క రూపాయి కేంద్రానికి కడితే.. కేంద్రం నుంచి 42 పైసలే ఇస్తున్నారని విమర్శించారు. నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతోందని సీఎం విమర్శించారు. ‘మేం బాధతో ఉన్నాం.. ఆర్థికంగా నష్టపోతున్నాం. రాజకీయంగా కూడా సెకండ్ గ్రేడ్‌గా చూస్తున్నా రు. మాపై వివక్ష కొనసాగుతుంది’ అని అన్నారు.
సౌత్ నుంచి బండి సంజయ్, కిషన్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కింద ని, ఇప్పుడు సీట్లు పెరిగాక వాళ్లకు చెప్పరాసి పదవి కూడా దొరకదని సీఎం ఎద్దువా చేశారు. ‘నా పోరాటం నా వ్యక్తిగతం కోసం కాదు.. ప్రజల కోసమే‘ అని స్పష్టం చేశారు. హడావిడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఆందో ళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారని తెలిపారు.
సీనియర్లకు అవమానం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌లో సీనియర్ నాయకులు ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్ల య్య, ఈటల రాజేందర్‌తోపాటు ఎంతోమందికి ఏమి జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసని, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా రేవంత్‌రెడ్డి అన్నారు.




