30 April, 2026 | 3:37 AM

మంజూరైన రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నిధులు కేటాయించి ప్రారంభించాలని వినతి

30-04-2026 02:17 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ లో మంజూరైన రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నిధులు కేటాయించి ప్రారంభించాలని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికగుప్త కి బుధవారం ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ యాదగిరియాదవ్ వినతిపత్రం అందజేశారు. 

ఘట్ కేసర్ డివిజన్ పరిధిలో 2025-26 సంవత్సరమునకు గాను 2025 జనవరిలో  9 పనులను గత మున్సిపల్ కమిషనర్ రాజేష్ మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి నిధులు కేటాయించలేదు.

మంజూరైన అభివృద్ధి పనులు రైల్వే గేటు గురుకుల్ నుంచి ద్వారక నగర్ వయా గీత మందిర్ డ్రైనేజ్, కరీంగూడ చౌరస్తా నుంచి ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు వరకు బిటి రోడ్డు, చిన్న చెరువు నుంచి గాంధీనగర్ వరకు డ్రైనేజ్, హిందూ స్మశాన వాటిక, కొండాపూర్ డంపింగ్ యార్డ్ పక్కన, ఎదులాబాద్ రోడ్డు పెట్రోల్ బంక్ నుండి బైపాస్ సర్వీస్ రహదారి వరకు 900 మీటర్ల డయ స్ట్రోకు నీటి పైపు, డ్రైనేజ్. కొండాపూర్ మెయిన్ రోడ్ నుండి ఈదమ్మ కాలనీ నర్సరీ వద్ద బీటి రోడ్డు, అంతర్గత డ్రైనేజ్ నిర్మాణ పనులు, నారాయణ గార్డెన్ నుండి కనకదుర్గ వైన్స్ ఎదులాబాద్ రోడ్డు వరకు సిసి రోడ్లు, పై విషయాల పై వెంటనే తగిన చర్యలు తీసుకోగలరు కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో మామిళ్ళ సతీష్, మామిళ్ల మల్లేష్, సయ్యద్ అహ్మద్ పాల్గొనడం జరిగింది.