13 June, 2026 | 2:57 AM

రెగ్యులర్ సర్వేయర్‌ను నియమించాలి

13-06-2026 12:31 AM

అలంపూర్, జూన్ 12 (విజయక్రాంతి): అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలంలో రెగ్యులర్ భూ సర్వేయర్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త శాంతకుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మధుమోహన్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండలంలో గత ఏడాదిన్నర కాలంగా సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉండటంతో భూ సర్వేలు, హద్దుల నిర్ధారణ పనులు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.

రైతులు మీసేవ కేంద్రాల ద్వారా చలానాలు చెల్లించి దరఖాస్తులు సమర్పించినప్పటికీ నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ స్పందిస్తూ, మానవపాడు మండలంలో సర్వేయర్ కొరత ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. జిల్లా సర్వే అధికారులతో చర్చించి త్వరలోనే రెగ్యులర్ సర్వేయర్ను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.