30 June, 2026 | 10:17 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కోట్ల గొంతుల ధిక్కార వేదిక

28-04-2026 01:48 AM
  1. ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి, విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక అని మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక, పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక అని తెలిపారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక అని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవా రం హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం.. సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచ కం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది

ఒక్కటే ఆవాజ్.. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని స్పష్టంచేశారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్‌ఎస్ అని తెలిపారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.